Kollu Ravindra Sagara Harathi: సాగర హారతితో చక్కటి సాంప్రదాయానికి శ్రీకారం: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Nov 05 , 2025 | 10:31 AM
సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. లక్ష మంది పైబడి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు.
కృష్ణా జిల్లా, నవంబర్ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు చేసి శివయ్యను దర్శించుకుంటున్నారు. మహిళలు దీపాలకు వెలిగించి నదిలో వదులుతూ నదీ పూజలు చేస్తున్నారు. రాష్ట్రంలోని శివాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఆ దేవదేవుడిని స్మరించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్‌లో భక్తులు సముద్ర స్నానాలు చేస్తున్నారు. సాగర సుప్రభాత హారతితో మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) సముద్ర స్నానాలను ప్రారంభించారు. ప్రముఖ వేదపండితులు విష్ణుభొట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో సముద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పవిత్ర సముద్ర స్నానం ఆచరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ... సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. లక్ష మంది పైబడి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సాగర హారతితో ఓ చక్కటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామన్నారు. తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. మంగినపూడి బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అమెరికాలో ఘోర ప్రమాదం.. పేలిన కార్గో విమానం
మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన.. ప్రముఖ సంస్థల ఛైర్మన్లతో
Read Latest AP News And Telugu News