Raja Singh: దమ్ముంటే సస్పెండ్ చేయండి
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:23 AM
బీజేపీ అధిష్ఠానం తనకు నోటీసులు జారీ చేయడం కాదని, కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అప్పుడు అందరి జాతకాలు బయట పెడతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

అప్పుడు అందరి బాగోతాలు బయటపెడతా
బీజేపీలో ఇంటి దొంగలంతా ఒక్కటయ్యారు: రాజాసింగ్
హైదరాబాద్ సిటీ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అధిష్ఠానం తనకు నోటీసులు జారీ చేయడం కాదని, కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అప్పుడు అందరి జాతకాలు బయట పెడతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో ప్రజల ముందుంచుతానని హెచ్చరించారు. బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటయ్యారని మండిపడ్డారు. కరీంనగర్ నుంచి తనపై వార్ మొదలైందని ఆరోపించారు.
తనను కెలికితే అందరి బాగోతాలూ బయటపెడతానని అన్నారు. రాజాసింగ్‌పై పార్టీ అధిష్ఠానం క్రమ శిక్షణ చర్యలకు సిద్ధమైందని, ఆయనకు నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొంత కాలంగా రాజాసింగ్ పార్టీలోని కొందరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు అంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజే పీ నేతలు బీఆర్‌ఎ్‌సతో కలిసిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News