Shrushti Fertility Center Case: నమ్రతను మరోసారి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్..
ABN , Publish Date - Aug 06 , 2025 | 07:54 PM
డాక్టర్ నమ్రతను కస్టడీకి ఇవ్వడం ద్వారా ఇంకా అనేకమైన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆమె నుంచి 86 మంది సరోగసీ దంపతుల వివరాలు సేకరించాలని తెలిపారు.
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదు రోజుల కస్టడీలో డాక్టర్ నమ్రతను విచారించిన పోలీసులు మరోసారి ఆమెను కస్టడీకి కోరుతూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
డాక్టర్ నమ్రతను కస్టడీకి ఇవ్వడం ద్వారా ఇంకా అనేకమైన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆమె నుంచి 86 మంది సరోగసీ దంపతుల వివరాలు సేకరించాలని తెలిపారు. సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు గుర్తించామని పేర్కొన్నారు. పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై ఇంకా విచారణ జరపాలని కోర్టుకు వివరించారు.
అయితే.. సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కన్సల్టెంట్‌గా పనిచేసిన వైద్యురాలి లెటర్ హెడ్‌లను నమ్రత వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వైద్యురాలి లెటర్ హెడ్‌పై మందులు, ఇంజెక్షన్లు రాసి ఇచ్చినట్లు గుర్తించారు. తన పేరుతో ఉన్న లెటర్‌హెడ్ చూసి వైద్యురాలు షాక్‌కు గురైందన్నారు. నమ్రతపై చర్యలు తీసుకోవాలని వైద్యురాలు ఫిర్యాదు చేసినట్లు గోపాలపురం పోలీసులు తెలిపారు. పోలీసుల దాఖలు చేసిన పిటిషన్‌పై ఎం తీర్పు వస్తుందో అని ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు