Share News

Elections: పల్లెల్లో.. ప్రచార సందడి

ABN , Publish Date - Dec 06 , 2025 | 09:33 AM

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచార సందడి కనిపిస్తుంది. తొలివిడత ఎన్నికల గుర్తులు కేటాయించడంతో ప్రచారం మరింతగా ఊపందుకుంటుంది. శనివారం రెండవ విడత ఎన్నికలకు సంబంధించిన గుర్తులను కేటాయించనున్నారు. ప్రస్తుతం మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

Elections: పల్లెల్లో.. ప్రచార సందడి

- పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు

- జిల్లాలో తొలివిడత ఎన్నికల గుర్తులు కేటాయింపు

- మద్దతును కూడగట్టేందుకు కుల సంఘాలకు గాలం

- పగలంతా పొలంలో సాగు పనులు..రాత్రి ప్రచారంతో బిజబీజీ

- విమర్శలు.. ప్రతి విమర్శలతో హీటెక్కుతున్న పల్లె రాజకీయం

ఆదిలాబాద్‌: జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు 3,870 వార్డులకు గాను మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని తేలిపోవడంతో ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు స్థానిక ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా వారివారి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికగా విస్త్రృతంగా ప్రచారం చేస్తూ దూసుకు పోతున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు వాల్‌ పోస్టర్స్‌, ప్రత్యేకంగా బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. సర్పంచ్‌ పదవులతో పాటు వార్డు మెంబర్‌ పదవులకు తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. ఈసారి యువకులే ఎక్కువగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామ అభివృద్ధిని చేసి చూపుతామంటూ నమ్మబలుకుతున్నారు.


గుర్తులతో ఓటర్ల వద్దకు..

ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్‌, వార్డు మెం బర్‌ అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఓటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, బ్యాట్‌, కప్పుసాసర్‌, గౌను, గ్యాస్‌స్టవ్‌ ఇలా రకరకాల గుర్తులను కేటాయించారు. తమ గుర్తును గుర్తంచుకోవాలంటూ ఓటర్లకు ప దేపదే సూచిస్తున్నారు. కొందరైతే డమ్మీ గుర్తులతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నా రు. చివరి సమయంలో గుర్తులను ఓటర్లకు ఉచితంగా పంపిణీ చేసే విధంగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ డంప్‌ చేసుకుంటున్నారు. డమ్మీ బ్యాలెట్‌ పత్రాలను ముద్రించి ఓటర్లకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. రెండవ విడతకు సంబంధించిన గుర్తులను శనివారం కేటాయించనున్నారు.పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో అన్ని గ్రామాల్లో సందడి వాతావరణమే కనిపిస్తుంది.


mnc2.jpg

గంప గుత్తా ఓట్లే టార్గెట్‌

కుల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గంపగుత్తగా ఓట్లను రాబట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కుల సంఘాల వారీగా సమావేశాల ను నిర్వహిస్తూ వారికి అవసరమైన ఆఫర్‌ చేస్తున్నారు. మందు విందు దావతులతో హల్చల్‌ చేస్తున్నారు. కుల సంఘాలకు అవసరమన వంట పాత్రలు, టెంటు సామగ్రి ఇతర పరికరాలను కొనిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల సంఘ భవనాలు, ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఒప్పంద పత్రాలు రాసుకుంటున్నారు. గంపగుత్తగా వచ్చే ఓట్ల ను టార్గెట్‌ చేస్తూ దేనికైనా రెడీ అంటూ నమ్మబలుకుతున్నా రు. అయితే అం దరికీ ఒకే అంటున్నా ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారో? అర్థం కాని పరిస్థితులు ఉన్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


పొద్దంతా పొలానికి.. రాత్రి ప్రచారం

పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థు లు సాగు పనులతో పాటు ఎన్నికల ప్రచారంపై ప్రత్యేకదృష్టిని సారిస్తున్నారు. పొద్దంతా పొలం బాట పడుతున్నా.. రాత్రివేళల్లో విస్త్రృతంగా ప్ర చారాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళలోనే గ్రామాల్లో ఎన్నికల ప్రచారం సందడి కనిపిస్తుంది. కొందరైతే సాగు పనుల కోసం ప్రత్యేకంగా కూలీలను నియమించుకుంటున్నారు. వ్య వసాయ పనులు చేస్తునే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అటు సాగు పనులు ఇటు ఎన్నికల ప్రచారంతో బిజిబిజీగా మారిపోతున్నా రు.


ప్రస్తుతం గ్రామాల్లో వరి కోతలు, పత్తి ఏరే పనులు కొనసాగుతున్నాయి. ఎన్నికల బిజీతో వ్యవసాయ పనులు వెనుకబడి పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభ్యర్థులైతే వ్యవసాయ పనులను వదిలేసుకుం టూ ఎన్నికల పైనే ప్రత్యేకదృష్టిని సారిస్తున్నారు. పంట దిగుబడులు చేతికి రావడంతో ఎన్నికలకు ఎలాంటి పైసల కొదవ లేదంటున్నారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులకు అప్పులిచ్చేందుకు కొంతమంది రైతులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గ్రామాల్లో ఎన్నికల హడావిడి మొదలు కావడంతో విమర్శలు ప్రతీ విమర్శలతో పల్లె రాజకీయం హీటెక్కుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత

రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2025 | 10:00 AM