Share News

Minister Gajendra Singh Shekhawat: బీజేపీ ఉన్నతిలో ప్రవాసీలు కీలకం..

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:59 PM

ఇద్దరు సభ్యుల బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా నిలవడంలో ప్రవాసీల పాత్ర మరువరానిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని సోమాజిగూడలోని ఓ హోటల్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసింది.

Minister Gajendra Singh Shekhawat: బీజేపీ ఉన్నతిలో ప్రవాసీలు కీలకం..

- కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌

హైదరాబాద్‌ సిటీ: ఇద్దరు సభ్యుల బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా నిలవడంలో ప్రవాసీల పాత్ర మరువరానిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌(Minister Gajendra Singh Shekhawat) అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని సోమాజిగూడలోని ఓ హోటల్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలోనూ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడించడంలో ప్రవాసీలు అత్యంత కీలక పాత్ర పోషించారన్నారు.


ఎన్నో ఉద్యమాల తరువాత తెలంగాణ పుట్టిందన్న ఆయన పదేళ్ల పాటు కుటుంబ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్నారు. అప్పుడు బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రె్‌స ఎంఐఎంతో ఒప్పందాలు చేసుకుని తమ ప్రభుత్వాలను నడిపాయని ఆరోపించారు. నవీన్‌ యాదవ్‌ అప్పుడు ఎంఐఎం.. ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున పోటీపడుతున్నాడని, ఈ పార్టీల ఒప్పందం ఎలా ఉందో తేటతెల్లం అవుతుందన్నారు.


zzzzzzzzzzzzzz.jpg

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్‌కు మాత్రమే పరిమితం కాదన్నారు. ఘనమైన బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ గడిచిన పదేఽళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో దివాలా తీసిందన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక పరిస్థితులు మరింత దిగజారాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజెపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రానుందని, అందుకు జూబ్లీహిల్స్‌ గెలుపు నాంది కావాలని ఆకాంక్షించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ దేశం, సమాజం కోసం బీజెపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల!

కిసాన్‌ డ్రోన్‌.. సాగు ఖర్చు డౌన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2025 | 01:59 PM