Share News

Cyberabad Police: నూతన సంవత్సరం వేళ.. క్యాబ్‌ బుకింగ్‌లను తిరస్కరిస్తే చర్యలు

ABN , Publish Date - Dec 30 , 2025 | 08:48 AM

నూతన సంవత్సరం వేళ.. క్యాబ్‌ బుకింగ్‌లను తిరస్కరిస్తే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు తెలుపుతున్నారు. రైడ్‌ క్యాన్సిల్‌ చేసిన వాహనం, సమయం, స్థలం వంటి వివరాలతో ప్రజలు ఫిర్యాదులను 9490617346 నంబరుకు వాట్సాప్‌ ద్వారా తమకు పంపాలని సూచించారు.

Cyberabad Police: నూతన సంవత్సరం వేళ.. క్యాబ్‌ బుకింగ్‌లను తిరస్కరిస్తే చర్యలు

- మార్గదర్శకాలు జారీ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సైబరాబాద్‌ పోలీసులు(Cyberabad Police) పలు మార్గదర్శకాలు జారీ చేశారు. క్యాబ్‌, ట్యాక్సీ, ఆటోరిక్షా ఆపరేటర్లు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని, ఆయా వాహనాల డ్రైవర్లు యూనిఫాంలో ఉండడంతో పాటు అన్ని పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు యాప్‌లో రైడ్‌ కోసం బుకింగ్‌ చేసుకుంటే దాన్ని తిరస్కరించకూడదని, నిరాకరిస్తే ఈ-చలాన్‌ రూపంలో జరిమానా విధించబడుతుందని పేర్కొన్నారు.


city5.2.jpg

రైడ్‌ క్యాన్సిల్‌ చేసిన వాహనం, సమయం, స్థలం వంటి వివరాలతో ప్రజలు ఫిర్యాదులను 9490617346 నంబరుకు వాట్సాప్‌ ద్వారా తమకు పంపాలని సూచించారు. క్యాబ్‌ల డ్రైవర్లు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించకూడదని, అధిక చార్జీలు డిమాండ్‌ చేయొద్దని తెలిపారు. బార్‌, పబ్‌, క్లబ్‌ వంటి ప్రాంతాల్లో మద్యం సేవించిన తర్వాత వినియోదారులు వాహనం నడపకుండా సంబంధిత నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.


city5.3.jpg

రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, అనధికార పార్కింగ్‌, సిగ్నల్‌ జంప్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడపడం వంటివి చేస్తే గుర్తించడానికి రోడ్లపై ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సైబరాబాద్‌ పరిధిలోని అన్ని రోడ్లలో డిసెంబర్‌ 31 రాత్రి 8 గంటల నుంచి మద్యం సేవించి వాహనం నడపడంపై విసృత్త తనిఖీలు నిర్వహించనున్నామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2న మళ్లీ సభకు వస్తారా?

గర్భధారణ 30 ఏళ్లలోపే...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 30 , 2025 | 08:48 AM