Share News

TG NEWS: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Jan 18 , 2025 | 07:22 AM

CRIME NEWS: సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరి మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

TG NEWS: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

సూర్యాపేట:సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ముందు వెళ్తున్నయోలో ప్రైవేట్ బస్సును వెనుక నుంచి వేగంగా జింగ్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో ముందు వెళ్తున్న బస్సు నెమ్మదిగా వెళ్లింది. అయితే అది గమనించని వెనుకాల బస్సు డ్రైవర్ అతివేగంగా వచ్చి ముందు బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వెనుక బస్సు బలంగా ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సు అద్దాలు పగలడంతో అందులో ఉండే క్లీనర్ సాయి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై పడిపోయిన క్లీనర్ పై నుంచి వెనుకాల ఉన్న బస్సు వెళ్లింది. దీంతో క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుడు గుండెపోటుతో మృతిచెందాడు. మృతులు గుంటూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Updated Date - Jan 18 , 2025 | 07:31 AM