Share News

CM Revanth Reddy: యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Feb 23 , 2025 | 08:06 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు.

CM Revanth Reddy: యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) ఆదివారం యాదగిరిగుట్ట (Yadagirigutta)కు వెళ్లనున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy) ప్రధాన ఆలయం దివ్వ విమాన స్వర్ణ గోపురం (Swarna Gopuram) ఆయన ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, హాజరు కానున్నారు. ఈ రోజు ఉదయం11.54 గంటలకు మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దేశంలోనే ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డు నెలకొంది. 50.5 అడుగుల ఎత్తు…10,759 చదరపు అడుగుల వైశాల్యం. 68 కిలోల బంగారం, రూ. 3.90 కోట్ల ఖర్చు.

ఈ వార్త కూడా చదవండి..

వైఎస్ జగన్‌.. భయమా.. మార్పా..


కాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరవుతున్నారు. ఆదివారం ఉదయం 11.54 గంటలకు మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహుర్తాన శ్రీసుదర్శన లక్ష్మీనరసింహ స్వామివారికి గోపురాన్ని అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మఠాధిపతులు పాల్గొంటారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం హెలికాప్టర్‌లో గుట్టకు రానున్నారు. స్వర్ణ విమానగోపురం ప్రతిష్ఠామహోత్సవం, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు భదత్రా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొండపై జరిగే సంప్రోక్షణ పూజల్లో సుమారు 25 వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా.


50.5 అడుగుల ఎత్తు.. 68 కిలోల బంగారం

స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉంటుంది. విమానగోపుర వైశాల్యం 10,759 చదరపు అడుగులు. గోపురం మొత్తానికి స్వర్ణతాపడం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని వినియోగించారు. చెన్నైకి చెందిన మెసర్స్‌ స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ ఈ పనులు నిర్వహించింది. బంగారం తాపడం చేసేందుకు మొత్తం రూ.3.90 కోట్లు ఖర్చు చేశారు. తాపడం అమర్చే పనులకు మొత్తం 68 కిలోల బంగారం, గోల్డ్‌ ఫ్లేటింగ్‌ తయారీ, అమరికకు రూ.8 కోట్లు వరకు వెచ్చించారు. మార్చి 1 నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే స్వర్ణతాపడం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు సకాలంలో పూర్తి చేసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వికటించిన వీధి నాటకం!

గ్రూప్‌-2 మెయిన్స్‌ నేడే

వైసీపీ కౌన్సిలర్‌ అరెస్ట్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 23 , 2025 | 08:06 AM