MP Raghunandan Rao: తప్పుడు వార్తలు రాయవద్దు..
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:15 AM
తప్పుడు వార్తలు రాయవద్దని, ఎవరి చేతుల్లో బలిపశువు కావద్దని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్‌రావు జర్నలిస్టులకు సూచించారు. ఏదైనా అంశంపై కథనం రాసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవాలని, వారు మాట్లాడడానికి స్పందించకపోతే స్పందించడం లేదని రాయాలని ఆయన సూచించారు.
- ఎంపీ రఘునందన్‌రావు
హైదరాబాద్: తప్పుడు వార్తలు రాయవద్దని, ఎవరి చేతుల్లో బలిపశువు కావద్దని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్‌రావు(Medak MP M. Raghunandan Rao) జర్నలిస్టులకు సూచించారు. ఏదైనా అంశంపై కథనం రాసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవాలని, వారు మాట్లాడడానికి స్పందించకపోతే స్పందించడం లేదని రాయాలని ఆయన సూచించారు. తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కప్పర ప్రసాద్ అధ్యక్షతన ‘డిజిటల్ మీడియా చట్టాలు’ అనే అంశంపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్(Somajiguda Press Club)లో అవగాహన సదస్సు జరిగింది.

ఇందులో యూనియన్ నాయకులతో పాటు డిజిటల్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ సంఘటితంగా ఉండి పోరాడి హక్కులు సాధించుకోవాలన్నారు. జర్నలిస్టులు తమ హక్కులు, పరిధులు ఏమిటో తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాద్ పలు అంశాలను ప్రస్తావించారు. అనంతరం తమ యూనియన్ కు అనుబంధంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మీడియా కమిటీ కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడు నరసింహ, కార్యదర్శి భరత్‌శర్మ, నిర్మల, సునీత, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ
Read Latest Telangana News and National News