MLA: స్కూల్ పిల్లలకు పెడుతున్నది దొడ్డు బియ్యం భోజనమే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 08:13 AM
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యంతో కా కుండా దొడ్డు బియ్యం భోజనమే వడ్డిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపణ
- సన్న బియ్యం పేరుతో మభ్య పెడుతున్నారని ధ్వజం
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యంతో కా కుండా దొడ్డు బియ్యం భోజనమే వడ్డిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ఆరోపించారు. శుక్రవారం ఆమె బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం కోసం వండిన అన్నం పరిశీలించిన ఆమె.. ఇది సన్నబియ్యం అన్నం కాదని, దొడ్డు బియ్యంతోనే వండారని విమర్శించారు.

భోజనం చూస్తేనే ఏ బియ్యమో తెలుస్తున్నదని, ఇందులో ఎవరి తప్పిదం ఉన్నదో అధికారులు బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో విద్యార్థులను సైతం మోసం చేస్తున్నదని సబితారెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే విద్యాశాఖ అధికారులు దీనిపై విచారణ జరపాలని, విద్యార్థులకు సన్నబియ్యం భోజనం వడ్డించేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, స్కూల్ హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News