Share News

MLA: వాంబే ఇళ్లను కూల్చి కొత్తవి కట్టిస్తాం..

ABN , Publish Date - Aug 13 , 2025 | 08:47 AM

ముట్టుకుంటే పడిపోయే స్థితిలో ఉన్న రంగానగర్‌ వాంబే ఇళ్లను త్వరలో కూల్చివేసి కొత్తవి నిర్మించి ఇస్తామని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ బాధితులకు హామీ ఇచ్చారు. మంగళవారం రంగానగర్‌ వాంబే ఇళ్ల బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ తహసీల్దార్‌, అధికారులతో కలిసి ఇళ్లను పరిశీలించారు.

MLA: వాంబే ఇళ్లను కూల్చి కొత్తవి కట్టిస్తాం..

- ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

హైదరాబాద్: ముట్టుకుంటే పడిపోయే స్థితిలో ఉన్న రంగానగర్‌ వాంబే ఇళ్లను త్వరలో కూల్చివేసి కొత్తవి నిర్మించి ఇస్తామని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌(Musheerabad MLA Mutha Gopal) బాధితులకు హామీ ఇచ్చారు. మంగళవారం రంగానగర్‌ వాంబే ఇళ్ల బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ తహసీల్దార్‌, అధికారులతో కలిసి ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... వాంబే పథకం కింద 1998లో నిర్మించిన పక్కా గృహాలను 44 కుటుంబాలకు అందజేశారని తెలిపారు. ఈ ఇళ్లు పూర్తిగా శిథిలావస్తకు చేరుకున్నాయని అన్నారు. వర్షం పడితే ఏక్షణాన ఏం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన బాధితులకు ఇళ్లు కట్టించే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బింగి నవీన్‌, బీఆర్‌ఎస్‌ భోలక్‌పూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు వై.శ్రీనివా్‌సరావు, నాయకులు రహీం, కృష్ణ, ప్రవీణ్‌, సుమన్‌, ఆరీఫ్‌, జీహెచ్‌ఎంసీ డీఈ సన్నీ పాల్గొన్నారు.

city5.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్‌ కోబ్రా

నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2025 | 09:17 AM