MLA: సీఎంగారూ.. తులం బంగారం హామీ ఏమైంది
ABN , Publish Date - Sep 19 , 2025 | 10:31 AM
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ లబ్ధిదారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయలతోపాటు ఒక తులం బంగారం లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే గోపాల్
హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్(Musheerabad MLA Mutha Gopal) లబ్ధిదారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయలతోపాటు ఒక తులం బంగారం లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయ పరిధిలో నూతనంగా మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 186మందికి గురువారం కవాడిగూడ డివిజన్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మి పథకం కింద 77, షాదిముబారక్ పథకం కింద 109 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ తులం బంగారం స్కీమ్ అమలు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చందన, ఆర్‌ఐ నిరంజన్, ఆర్‌ఐ శివప్రసాద్, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్యామ్‌యాదవ్, కవాడిగూడ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఆర్.రాంచందర్, రాజేష్, మీడియా ఇన్‌చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్‌ముదిరాజ్, శివ ముదిరాజ్, ప్రవీణ్, దీన్‌దయాల్‌రెడ్డి, మాదవ్, శ్యామ్‌సుందర్, మహ్మద్‌అలీ పాల్గొన్నారు.
కార్పొరేటర్ల నిరసన
ముషీరాబాద్ తహసల్దార్ కార్యాలయంలో జరిగిన షాదీముబాకర్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రె వెన్యూ అఽధికారులు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా అమానించారని కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియానవీన్‌గౌడ్, రాంనగర్ కార్పొరేటర్ రవిచారి డిప్యూటీ తహసీల్దార్ చందనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తమఫొటోలు లేకపోవడం పట్ల నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లబ్ధిదారులకు ఉదయం పదిగంటలకు సమయం ఇచ్చి 11.30 గంటల వరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ వచ్చే వరకు కార్యక్రమాన్ని ప్రారంభించలేదని వారు ఆరోపించారు.
అనేకమార్లు లబ్ధిదారులు. కార్పొరేటర్లు ఎమ్మెల్యే కోసం వేచి చూస్తారని కానీ ఈసారి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎవరినీ పట్టించుకోకుండా ఆలస్యంగా వచ్చి చెక్కుల పంపిణీ చేయడం సరికాదన్నారు. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అఽధికారికంగా ఎవరూ చెప్పకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేశారని అరోపించారు. ప్రతిసారి కార్యక్రమ వేదికపై ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో తమ ఫొటోలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల వారు ముషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ చందనపై ఆగ్రహం చేశారు. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News