Share News

Minister: జూబ్లీహిల్స్‌ అభివృద్ధి బాధ్యత నాదే..

ABN , Publish Date - Sep 18 , 2025 | 09:18 AM

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. రహ్మత్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ బస్తీల్లో రూ.4.62 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీరు, డ్రైనేజీ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు.

 Minister: జూబ్లీహిల్స్‌ అభివృద్ధి బాధ్యత నాదే..

- రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి(State Minister Gaddam Vivek Venkataswamy) అన్నారు. రహ్మత్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ బస్తీల్లో రూ.4.62 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీరు, డ్రైనేజీ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రహ్మత్‌ నగర్‌(Rahmat Nagar) కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పేదలు అధికంగా నివసించే ప్రాంతాల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు చెప్పారు.


city6.2.jpg

ఎక్కడైనా పనులు నిలిచిపోతే సొంత డబ్బులతో పూర్తి చేయిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎం.అంజన్‌ కుమార్‌ యాదవ్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మల్‌రెడ్డి రాంరెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్‌, పటేల్‌ రమేష్‌రెడ్డి, జైపాల్‌, రహ్మత్‌ నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి, వి.నవీన్‌ యాదవ్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి రాణి రాథోడ్‌, నగర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బి.భవానీశంకర్‌, సీనియర్‌ నాయకుడు గ్యార నాగరాజు, వివిధ బస్తీల నాయకులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 18 , 2025 | 09:18 AM