Minister Ponnam Prabhakar: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గణేశ్ ఉత్సవాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:51 AM
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గణేశ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గణేశ్ ఉత్సవాలు- 2025 సన్నాహక సమావేశం మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగింది.
- ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గణేశ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(In-charge Minister Ponnam Prabhakar) చెప్పారు. గణేశ్ ఉత్సవాలు- 2025 సన్నాహక సమావేశం మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విగ్రహాలను తీసుకురావడం,
పూజలు, నిమ్మజ్జనం ఇలా మూడు విభాగాలుగా విభజించి సమీక్షా సమావేశాలు నిర్వహించుకోనున్నట్టు తెలిపారు. వేడుకలు సజావుగా జరిగేలా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. మూడు కమిషరేట్‌ల పరిధిలో సుమారు లక్ష వినాయక విగ్రహాలను ప్రతిష్టించే అవకాముందని,

వాటిని దృష్టిలోపెట్టుకొని పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. శానిటేషన్ విభాగం మండపాల వద్ద పారిశుధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు హుస్సెన్‌సాగర్ వద్ద నిమజ్జన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. సమావేశంలో మేయర్ విజయలక్షి, డీజీపీ జితేందర్‌రెడ్డి, మూడు కమిషనరేట్ల కమిషనర్లు, అధికారులు, ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘కన్ఫర్డ్’లుగా 17 మంది సిఫారసు!
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తీసేయండి
Read Latest Telangana News and National News