Heavy Rains: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్..
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:55 PM
హైదరాబాద్ నగరంలో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుంది, ఆ తర్వాత ఆకాశం మేఘావృతమై.. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్టోబర్ 10 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని పేర్కొంది. దీంతో పాటూ..
హైదరాబాద్ నగరంలో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుంది, ఆ తర్వాత ఆకాశం మేఘావృతమై.. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్టోబర్ 10 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని పేర్కొంది. దీంతో పాటూ తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
అదేవిధంగా నాగర్‌కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, సూర్యాపేట, గద్వాల్, నల్గొండ, యాదాద్రి - భోంగీర్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, జనగాం, వరంగల్, హన్మకొండలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదిలావుండగా, ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుడడంతో హైదరాబాద్‌తో పాటూ తెలంగాణలోని జిల్లా్ల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. ఇక హైదరాబాద్‌లోని బండ్లగూడో సోమవారం ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిసింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ ధోకా కార్డుపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్
కొమరం భీం పోరాటం.. ఆత్మగౌరవం కోసమే: మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News