Share News

Health: మందుల నిల్వలకు అవస్థలు.. పీహెచ్‏సీల్లో సౌకర్యాలు నిల్..

ABN , Publish Date - Dec 03 , 2025 | 10:44 AM

హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన వసతులు ఇటు రోగులు, అటు సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పీహెచ్‌సీలలో మందులు నిల్వ చేసుకునేందుకు సరైన స్టోరీజీలు కూడా లేవు. ప్రజారోగ్యాన్ని పాలకులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.

Health: మందుల నిల్వలకు అవస్థలు.. పీహెచ్‏సీల్లో సౌకర్యాలు నిల్..

- ఆరోగ్య కేంద్రాల్లో సరైన స్టోరీజీ లేక సమస్యలు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad)లోని కొన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వకు సరైన స్టోరేజీ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందుల నిల్వ చాలా ముఖ్యం. లేకపోతే వాటి విలువను కోల్పోయే ముప్పు ఉంటుంది. జబ్బులపై మందుల పనిచేయాలంటే సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన అవసరముంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 125 వరకు యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీలున్నాయి. ఇందులో సగానికిపైగా ఆరోగ్య కేంద్రాల్లో డ్రగ్‌ స్టోరీజీలు లేవు.


దీంతో మందులను అల్మారా, సెల్ఫ్‌, డబ్బాల్లో మందులను నిల్వ ఉంచుతున్నారు. యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో సాధారణ మందులే కాకుండా పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్లు, గర్బిణులకు ఇచ్చే ఇంజెక్షన్లు ఉంటాయి. పిల్లలకు దగ్గు, జలుబు, జ్వరం, ఇతర సమస్యలకు నిల్వ చేయలేని పరిస్థితి. ఆరోగ్య కేంద్రాల్లో చాలా చోట్ల ఏసీ సదుపాయం లేదు. నిబంధనల ప్రకారం తగిన ఉష్ణోగ్రతలో మందులను ఉంచడం లేదు.


city7.2.jpg

ఇలా సరైన స్థలంలో మందులను నిల్వ చేయకపోతే వాటి ప్రాపర్టీస్‌ కోల్పోతాయని నిపుణులు చెబుతున్నారు. సరైన నిల్వ లేని మందుల ఇవ్వడం వల్ల జబ్బు నయం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో అత్యంత ముఖ్యమైన డ్రగ్ట్‌ స్టోరీజీని ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపాల్సిన అవసరముందంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 10:44 AM