Suryapeta CMRF: కోదాడ సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం.. ఆరుగురి అరెస్ట్
ABN , Publish Date - Aug 16 , 2025 | 02:49 PM
ఆరోగ్య సమస్యలతో సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా ఆ డబ్బులను వేరే ఖాతాలకు మళ్లించి నొక్కేసిందని ఎస్పీ నరసింహ వివరించారు. గత కొంతకాలంగా సదరు ముఠా పలువురి సీఎంఆర్‌ఎఫ్ నిధులను కాజేస్తుందని గుర్తించారు.
సూర్యాపేట: కోదాడలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణంను సీసీఎస్ పోలీసులు చేధించారు. కోదాడ కేంద్రంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్‌లో ఆరుగురి ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ కె.నరసింహ చెప్పారు. మొత్తం 44 చెక్కులకు 38 చెక్కులను ముఠా విత్ డ్రా చేసినట్లు పేర్కొన్నారు. ఇంకో ఆరు చెక్కులను విత్ డ్రా చేసేందుకు ప్లాన్ చేస్తుండగా పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుల నుంచి రూ.9 లక్షల 30 వేల నగదు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఆరోగ్య సమస్యలతో సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా ఆ డబ్బులను వేరే ఖాతాలకు మళ్లించి నొక్కేసిందని ఎస్పీ నరసింహ వివరించారు. గత కొంతకాలంగా సదరు ముఠా పలువురి సీఎంఆర్‌ఎఫ్ నిధులను కాజేస్తుందని గుర్తించారు. ఈ క్రమంలో కోదాడ నియోజక వర్గానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కలిసి ముఠాగా ఏర్పడి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే సీఎంఆర్ఎఫ్ చెక్కులు సంబంధిత ప్రజాప్రతినిధి కార్యాలయానికి చేరుకుంటాయి. అయితే వీటిని ఆయన కింద పనిచేసే సిబ్బంది పంపిణీ చేస్తామని చెప్పి తీసుకుంటుంది. ఆ తర్వాత అప్లై చేసుకున్నవారిని కాదని ఇంటి పేరుకు దగ్గరగా పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముఠా.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు విచారణలో వెలుగుచూసిందని ఎస్పీ నరసింహ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు