Share News

MLC Kavitha: బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్‌ నిర్ణయం.. జాగృతి విజయమే

ABN , Publish Date - Jul 11 , 2025 | 05:09 AM

రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో తెలంగాణ జాగృతి చేపట్టిన ఉద్యమాలకు రేవంత్‌ సర్కార్‌ దిగొచ్చిందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

MLC Kavitha: బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్‌ నిర్ణయం.. జాగృతి విజయమే

  • జై తెలంగాణ అనని వ్యక్తి.. సీఎం అయ్యారు: ఎమ్మెల్సీ కవిత

  • 5గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలంటూ ఏపీ సీఎంకు లేఖ

కొత్తగూడెం/హైదరాబాద్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో తెలంగాణ జాగృతి చేపట్టిన ఉద్యమాలకు రేవంత్‌ సర్కార్‌ దిగొచ్చిందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలపడం తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌, బీసీ సమాజం సాధించిన ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత కనీసం జై తెలంగాణ అనని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని కవిత ధ్వజమెత్తారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కాంగ్రెస్‌ పాలనలో ఆగమైపోతోందన్నారు. కొత్తగూడెంలో గురువారం తెలంగాణ జాగృతి జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు.


ముఖ్య అతిథిగా కవిత మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి వాస్తు భయంతో సచివాలయానికి రావడం లేదన్నారు. సీఎం విసిరే సవాళ్లను తాము స్వీకరించగానే తోక ముడుస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణి సంస్థను పట్టించుకోవడం లేదని, ప్రైవేటీకరించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా, భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్న 5 పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. 2014లో ఏకపక్షంగా విలీనం చేసుకోవడంతో యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏపీలో ఉన్న భద్రాచలం ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 05:09 AM