Kaleshwaram project: కాళేశ్వరం రుణాల పునర్‌వ్యవస్థీకరణ
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:28 AM
కాళేశ్వరం ప్రాజెక్టు కింద తీసుకున్న రుణాల చెల్లింపు అంశంలో రాష్ట్రానికి స్వల్ప ఉపశమనం లభించింది. కాళేశ్వరంతో పాటు ఇతర కార్పొరేషన్‌ల కింద తీసుకున్న అప్పుల్లో రూ.26 వేల కోట్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణ(రీస్ట్రక్చరింగ్)కు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
రూ.26వేల కోట్ల అప్పు రీస్ట్రక్చరింగ్‌కు కేంద్రం అంగీకారం
రుణాలపై 10.9 నుంచి 7.5 శాతానికి తగ్గనున్న వడ్డీ
10 నుంచి 25 ఏళ్లకు పెరగనున్న చెల్లింపు గడువు
ఏటా రూ.4వేల కోట్ల మేర తగ్గనున్న భారం
సర్కారు ఉపశమనం
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు కింద తీసుకున్న రుణాల చెల్లింపు అంశంలో రాష్ట్రానికి స్వల్ప ఉపశమనం లభించింది. కాళేశ్వరంతో పాటు ఇతర కార్పొరేషన్‌ల కింద తీసుకున్న అప్పుల్లో రూ.26 వేల కోట్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణ(రీస్ట్రక్చరింగ్)కు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో వడ్డీ భారం తగ్గడంతోపాటు రుణ చెల్లింపు వ్యవధి కూడా పెరగనుంది. కాళేశ్వరంతో పాటు తెలంగాణ నీటి వనరుల మౌలిక సదుపాయాల సంస్థ(టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఐడీసీఎల్)లు వివిధ ప్రాజెక్టుల ఎలకో్ట్ర మెకానికల్ కాంపోనెంట్ల(పం్‌పహౌ్‌సలు, సంబంధిత పనులు) కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎ్‌ఫసీ) నుంచి 10.90 శాతం వార్షిక వడ్డీతో స్వల్పకాలిక రుణాలను సేకరించాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ బ్యాంకులతో పాటు ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ నుంచి రూ.87,449 కోట్ల రుణం మంజూరవ్వగా అందులో రూ.71,566 కోట్లు విడుదలయ్యాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.10,000 కోట్ల రుణం మంజూరు కాగా రూ.7,722 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటిదాకా చేసిన చెల్లింపులు పోను ఈ రెండు ప్రాజెక్టులు కలిపి ఇంకా రూ.68,273 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులకు కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకున్నారు. టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఐడీసీఎల్ ద్వారా ఇందిరమ్మ వరద కాలువ, దేవాదుల ఎత్తిపోతల పథకం, సమ్మక్కసాగర్ బ్యారేజీ, సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ బ్యారేజీ కోసం రూ.19,643 కోట్ల రుణాన్ని సేకరించారు. ఇందులో ప్రస్తుతం రూ.12,856 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలన్నీ 10.75 నుంచి 11.25 శాతం వార్షిక వడ్డీతో తీసుకున్న స్వల్ప కాలిక రుణాలే. దీంతో రెండు కార్పొరేషన్ల నుంచి రుణాల(అసలు, వడ్డీ) చెల్లింపునకు ఏటా రూ.13వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం రుణాల్లో రూ.26వేల కోట్ల రుణం పునర్‌వ్యవస్థీకరణకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో స్వల్పకాలిక రుణం కాస్తా దీర్ఘకాలిక రుణంగా మారనుంది. రాబోయే 10 ఏళ్లలో ఈ రుణం చెల్లించాల్సి ఉండగా.. పునర్‌వ్యవస్థీకరణతో రుణ చెల్లింపు వ్యవధి 25 నుంచి 30 ఏళ్లకు పెరగనుంది. ప్రస్తుతం 10.9 శాతంగా ఉన్న వార్షిక వడ్డీ 7.5 శాతానికి తగ్గనుంది. ఫలితంగా ఏటా రుణ చెల్లింపులకు కేటాయిస్తున్న మొత్తం రూ.13వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్లకు తగ్గనుంది. దాంతో రూ.4 వేల కోట్ల మేర నిధులు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కాదని అవునన్నారు..
కాళేశ్వరం కార్పొరేషన్ కింద పీఎ్‌ఫసీ నుంచి తీసుకున్న రూ.37,737 కోట్లు, ఆర్‌ఈసీ నుంచి తీసుకున్న రూ.30,536 కోట్ల రుణాలను పునర్‌వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నాయా ? అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మార్చి 17న లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. ఇందుకు స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పునర్‌వ్యవస్థీకరణ ఆలోచన లేదని బదులిచ్చారు. అప్పుడు కాదన్న కేంద్రం అనూహ్యంగా రుణాల రీస్ట్రక్చరింగ్‌కు అంగీకారం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించినట్లయింది. రుణాలు రీస్ట్రక్చరింగ్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు కొంత మేర సత్ఫలితం ఇచ్చినట్లు అయింది.
కాళేశ్వరం కార్పొరేషన్
తీసుకున్న స్వల్పకాలిక రుణాలివే..
రుణ సంస్థ ఇచ్చిన రుణం వడ్డీ శాతం
(రూ.కోట్లలో)
పీఎ్‌ఫసీ 25,312 9.45-10.90
ఆర్‌ఈసీ లింక్-1 4,657.95 10.90
ఆర్‌ఈసీ లింక్-2 11784.70 10.90
ఆర్‌ఈసీ లింక్-4 14,093 10.90
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
Read Latest Telangana News and National News