MLA: తప్పుల తడకగా కాళేశ్వరం విచారణ కమిటీ నివేదిక..
ABN , Publish Date - Aug 06 , 2025 | 08:06 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, బీఆర్‌ఎస్ పార్టీని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను అప్రదిష్ట పాల్జేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, బీఆర్‌ఎస్ పార్టీని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను అప్రదిష్ట పాల్జేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కృషిని తెలియజేసేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీ్‌షరావు మంగళవారం నగరంలోని తెలంగాణ భవన్ నుంచి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని పార్టీ ముఖ్య నాయకులు వీక్షించేందుకు గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. హరీశ్ రావు(Harish Rao) ప్రజెంటేషన్ పూర్తయ్యాక ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని, కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతే రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ నాయ కులు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కార్మికులు, ఇంజనీర్లు మృతి ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వీలైనంత త్వరగా మరమత్తులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

అమృత తండా వాసులకు ఇళ్లు కేటాయించండి..
వర్షాకాలంలో ఫతేనగర్ డివిజన్‌లోని అమృత తండా పక్కనే ఉన్న నాలా ఉధృతంగా ప్రవహించి ఇళ్లలోకి నీరు చేరి తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరికి కైత్లాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని జెడ్సీ అపూర్వచౌహన్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
మంగళవారం ఆయన ఫతేనగర్ కార్పొరేటర్ సతీ్‌షగౌడ్‌తో పాటు జెడ్సీని కలిసి తండావాసులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. వర్షం వస్తే తండాలో ఉండలేని పరిస్థితి నెలకొందని, నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తండావాసుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని జెడ్సీ అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ఫతేనగర్‌వాసులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Read Latest Telangana News and National News