Hyderabad: సీఎస్‌గా రామకృష్ణారావు
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:22 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు వరకు 4 నెలల పాటు ఆయన సీఎస్ పదవిలో కొనసాగనున్నారు.
ఈ ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలం.. అనుభవం, సీనియారిటీకి పెద్దపీట
14 రాష్ట్ర బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఘనత.. సీఎస్ ఆయనేనని ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు వరకు 4 నెలల పాటు ఆయన సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతికుమారికి ఈ నెల 7 నాటికే 60 ఏళ్లు పూర్తయ్యాయి. అఖిల భారత సర్వీసు అధికారుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవులు మినహా అఖిల భారత సర్వీసులు, ఇతర ఉద్యోగుల జన్మదినాలు నెల మధ్యలో ఉంటే.. నెలాఖరున రిటైర్ అవుతుంటారు. ఈ క్రమంలో శాంతికుమారి కూడా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు రామకృష్ణారావు సీఎ్‌సగా బాధ్యతలు స్వీకరిస్తారు. శాంతికుమారి బీఆర్‌ఎస్ హయాంలో సీఎ్‌సగా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎ్‌సగా ఆమెనే కొనసాగించారు. 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 1990 బ్యాచ్‌లో శశాంక్ గోయల్, 1991 బ్యాచ్‌లో రామకృష్ణారావు, జయశ్‌రంజన్, సంజాయ్ జాజు ఉన్నారు. రాష్ట్ర కేడర్‌లో శశాంక్ గోయల్ సీనియర్ అయినప్పటికీ ఆయన్ను మొదటి నుంచీ అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ప్రాధాన్యం లేని పోస్టులే ఇస్తూ వచ్చాయి. సంజాయ్ జాబు కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతుండగా, జయశ్ రంజన్, రామకృష్ణారావుల్లో ఒకర్ని సీఎ్‌సగా చేయాలని సర్కారు భావించింది. అయితే మొదటి నుంచీ రామకృష్ణారావు వైపే సర్కారు మొగ్గుచూపుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
గురుకులంలో చదివి.. రాష్ట్ర సీఎ్‌సగా..
రామకృష్ణారావు 1965 ఆగస్టు 30న ఉమ్మడి ఏపీలోని అనంతపురంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వరంగల్‌లో రైల్వే శాఖలో పనిచేశారు. అనంతపురం జిల్లాలోని కొడిగెన్‌హళ్లి గురుకుల పాఠశాలలో 1980లో పదో తరగతి పూర్తి చేసిన రామకృష్ణారావు.. కాన్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేశారు. ఢిల్లీ ఐఐటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజనలో కీలక పాత్ర పోషించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 2016 ఫిబ్రవరి 2న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక శాఖను కూడా ఆయన వద్దనే ఉంచుతూ సర్కారు మరో జీవో జారీ చేసింది. మొత్తం 14 రాష్ట్ర బడ్జెట్‌లను (ఓటాన్ అకౌంట్‌తో కలిపి) ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణారావును సీఎ్‌సగా నియమించనుందని మార్చి 18నే ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News