Share News

Jubilee Hills by-election: డీఆర్సీ సెంటర్‏కు మూడంచెల భద్రత..

ABN , Publish Date - Oct 31 , 2025 | 09:43 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రక్రియను నిర్వహించే యూసు్‌ఫగూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాన్ని డిస్ర్టిబ్యూషన్‌ రిసెప్షన్‌ కౌంటింగ్‌ (డీఆర్సీ)సెంటర్‌గా మార్చి మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్ట్రాంగ్‌రూమ్‌ భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి.

Jubilee Hills by-election: డీఆర్సీ సెంటర్‏కు మూడంచెల భద్రత..

- స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ప్రక్రియను నిర్వహించే యూసు్‌ఫగూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాన్ని డిస్ర్టిబ్యూషన్‌ రిసెప్షన్‌ కౌంటింగ్‌ (డీఆర్సీ)సెంటర్‌గా మార్చి మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్ట్రాంగ్‌రూమ్‌ భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి.

- మొదటి అంచెలో.. విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం ప్రధాన గేటు వద్ద ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్‌ఐలు, ఎనిమిది మంది ఏఎస్ఐలు, 33మంది కానిస్టేబుళ్లు, 8మంది ఉమెన్‌ కానిస్టేబుళ్లు, 3 ప్లాటూన్ల సాయుధ బలగాలతో భద్రత ఏర్పాటుచేయనున్నారు.


city6.jpg

- రెండో అంచెలో.. స్టేడియం లోపలికి వెళ్లే గేటు వద్ద ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఏఎ్‌సఐలు, 8 మంది కానిస్టేబుళ్లు, నలుగురు ఉమెన్‌ కానిస్టేబుళ్లు, రెండు చెకింగ్‌ టీమ్‌లు, రెండు అడ్యూడ్‌ ఫోర్సెస్‌ ప్లాటూన్లు బందోబస్తు నిర్వహించనున్నాయి.

- మూడో అంచెలో.. స్టేడియం లోపల ఈవీఎంల పంపిణీ, ఓట్ల లెక్కింపును చూసేలా ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు ఏఎ్‌సలు, 12మంది కానిస్టేబుళ్లు, ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు నిఘాలో ఉండనున్నారు.


- స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ఒక ప్లాటూన్‌ సాయుధ బలగాలు 24 గంటల పాటూ అప్రమత్తంగా ఉండనున్నాయి.

- స్టేడియానికి వెళ్లే రోడ్లలో ఆరు పికెటింగ్‌లు ఏర్పాటు

చేయనున్నారు.

- వెస్ట్‌జోన్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ పర్యవేక్షణలో స్టేడియం వద్ద మూడంచెల భద్రత, నిరంతర నిఘా మధ్య కొనసాగనుంది..

- స్టేడియం చుట్టూ, పికెటింగ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మపాల అమృతాన్ని పంచి..

తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2025 | 09:46 AM