Jubilee Hills by-election: రూ.10 వేలు మించొద్దు..
ABN , Publish Date - Oct 28 , 2025 | 07:16 AM
నామినేషన్ వేసిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు అభ్యర్థులు ఇతర వ్యక్తులు, సంస్థలకు రూ.10 వేలకు మించి నగదు లావాదేవీలు జరపవద్దని, చెక్కుల రూపంలో డబ్బుల బదిలీ ఉండాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్‌లాల్, సహాయ వ్యయ పరిశీలకులు రామకృష్ణ సూచించారు.
- నగదు బదిలీపై ఎన్నికల పరిశీలకుల వెల్లడి
- పోస్టల్ బ్యాలెట్ కోసం 102 దరఖాస్తులు
హైదరాబాద్ సిటీ: నామినేషన్ వేసిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు అభ్యర్థులు ఇతర వ్యక్తులు, సంస్థలకు రూ.10 వేలకు మించి నగదు లావాదేవీలు జరపవద్దని, చెక్కుల రూపంలో డబ్బుల బదిలీ ఉండాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్‌లాల్(Sanjeev Kumar Lal), సహాయ వ్యయ పరిశీలకులు రామకృష్ణ సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక(Jubilee Hills Constituency By-election)లో పోటీ చేస్తున్న 58 మంది అభ్యర్థులు తమ రోజువారి ఖర్చులు నమోదు చేసే మూడు రిజిస్టర్లను మూడుసార్లు ఎన్నికల వ్యయ పరిశీలకుల ఎదుట తనిఖీ చేయించుకోవాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.

నేడు (27వ తేదీ) మొదటిసారి, నవంబరు 3వ తేదీన రెండోసారి, 9న మూడోసారి రిజిస్టర్ల తనిఖీ ఉంటుందన్నారు. కాగా, ఉప ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఇప్పటి వరకు 102 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. 80 యేళ్లు దాటిన వయోధికులు, దివ్యాంగులు, పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News