Jubilee Hills by-election: ఇష్టదైవాలపై భారం వేసిన అభ్యర్థులు
ABN , Publish Date - Nov 14 , 2025 | 07:31 AM
ప్రచారం బాగా చేశాం. కాలికి బలపం కట్టుకున్నట్లుగా ఇంటింటికి తిరిగినం. ఓటర్లకు తాయిలాలు కూడా భారీగానే అందించాం. పోలింగ్ రోజున తమకు ఓట్లు కూడా బాగానే పడ్డాయని ఆశిస్తున్నాం. ఇక మీ దయ.. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేలా కరుణించండి..’’ అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: ‘‘ప్రచారం బాగా చేశాం. కాలికి బలపం కట్టుకున్నట్లుగా ఇంటింటికి తిరిగినం. ఓటర్లకు తాయిలాలు కూడా భారీగానే అందించాం. పోలింగ్ రోజున తమకు ఓట్లు కూడా బాగానే పడ్డాయని ఆశిస్తున్నాం. ఇక మీ దయ.. ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేలా కరుణించండి..’’ అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తున్నారు. శుక్రవారం జరిగే కౌంటింగ్‌కు మరికొన్ని ఘడియలు మాత్రమే మిగిలిన ఉన్న తరుణంలో గురువారం సాయంత్రం రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు,

ముఖ్యనాయకుల్లో కొంతమంది తీవ్ర ఒత్తిడికి గురవుతూ, దేవుళ్లను వేడుకుంటూ తమ అనుచరుల వద్ద పై విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గతంలో కంటే ఈసారి జరిగిన ఎన్నిక తమకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయని గెలుపోటములు తమ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయంటూ దేవతామూర్తులను వేడుకుంటున్నారు. గెలిచిన తర్వాత మీ సన్నిధికి వచ్చి ముడుపులు చెల్లిస్తానమని పూజిస్తున్నట్లు తెలిసింది. కాగా, అభ్యర్థులతోపాటువారి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు కూడా పూజల్లో నిమగ్నమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భరత్‌రామ్ నుంచి ప్రాణహాని ఉంది
Read Latest Telangana News and National News