Kite Festival: జనవరి 13 నుంచి పతంగుల పండుగ
ABN , Publish Date - Dec 18 , 2025 | 08:06 AM
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని జనవరి 13 నుంచి పతంగుల పండుగను నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు
- గండిపేటలో హాట్ ఎయిర్ బెలూన్ల ప్రదర్శన
హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా మూడు రోజుల పాటు ‘ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్’ను నిర్వహించేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న పతంగుల పండుగలో ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయ్‌లాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ తదితర దేశాల నుంచి సుమారు 50 మందికి పైగా అంతర్జాతీయ పతంగుల ఆటగాళ్లు(కైట్ ఫ్లైయర్స్) పాల్గొననున్నారు.

అలాగే తెలంగాణతో పాటు గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్(Tamil Nadu, Kerala, Haryana, Andhra Pradesh) తదితర రాష్ట్రాల నుంచి సుమారు 60 మందికి పైగా కైట్స్ క్లబ్ సభ్యులు, పతంగులు ఎగురవేసే నిపుణులు పాల్గొంటారు. అంతేకాకుండా నగర శివారు గండిపేట ప్రాంతంలో హాట్‌ఎయిర్ బెలూన్లు ఎగుర వేసే ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. పరేడ్ మైదానంలో కైట్స్ ఫెస్టివల్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హస్తకళలు, వివిధ ప్రత్యేక వంటకాలు, స్వీట్లతో స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
Read Latest Telangana News and National News