Hyderabad: ఉదయం నుంచే భానుడి ప్రతాపం..
ABN , Publish Date - Apr 10 , 2025 | 07:32 AM
హైదరాబాద నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ మండుతోంది. వాతావణంలో వచ్చిన మార్పులతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సంబంధిత అధఇకారులు తెలుపుతున్నారు.

- వేడిగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
- నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 39.5 డిగ్రీలు
హైదరాబాద్ సిటీ: ఉదయం 9 గంటల నుంచే ఎండ మండుతోంది. రెండు రోజులుగా వేడిగాలులు, ఉక్కపోత నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వర్షంపడినంత సేపు చల్లగా ఉన్నా తర్వాత ఉక్కపోత పెరుగుతోంది. కాప్రా రాజీవ్‌నగర్, సికింద్రాబాద్ న్యూ మెట్టుగూడ(Capra Rajivnagar, Secunderabad New Mettuguda) గోషామహల్, షేక్‌పేట ప్రాంతాల్లో బుధవారం మధ్నాహం ఉష్ణోగ్రతలు 39.5 డిగ్రీలు నమోదయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: Land Allocation: హెచ్‌సీయూకే అత్యధిక భూములు
గ్రేటర్ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 39-40 డిగ్రీలుగా నమోదవుతున్నా 42 డిగ్రీల తీవ్రత కన్పిస్తోంది. వేడిగాలుల తీవ్రత సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుండటంతో మధ్యాహ్నం ప్రధాన రహదారులపై వెళ్లే వాహనదారులు వేడిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండతీవ్రత కారణంగా మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ కొంత తక్కువగా ఉంటుంది.
నేడు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్(Hyderabad, Ranga Reddy, Medchal) జిల్లాలో సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశముంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 38డిగ్రీల నుంచి 23డిగ్రీల వరకు ఉంటాయన్నారు. ఉపరితల గాలులు దక్షిణ తూర్పు దిశలో గంటకు 6-10 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Greenfield Expressway: హైదరాబాద్-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే
CM Revanth Reddy: బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు
Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..
Read Latest Telangana News and National News