Share News

AV Ranganath: లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయం..

ABN , Publish Date - Dec 05 , 2025 | 09:04 AM

2026లో లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ... 15 నెలల కాలంలో 60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించిందని ఆయన అన్నారు.

AV Ranganath: లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయం..

- సమాజంలో ఉన్న ట్యూమర్లను తొలగిస్తున్నాం..

- ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులు రక్షిస్తున్నాం

- హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైదరాబాద్: శస్త్రచికిత్సలు చేసే వైద్యుల కంటే తాము ఏమాత్రం తక్కువ కాదని, వ్యాధులకు వైద్యులు చికిత్స చేస్తుంటే, సమాజంలో ఉన్న ట్యూమర్లను తాము తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) అన్నారు. ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తున్నామన్నారు. గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ 12వ వార్షికోత్సవాన్ని గురువారం హోటల్‌ దసపల్లాలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ..


15 నెలల కాలంలో 60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించిందన్నారు. 2026లో లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులను తిరిగి తెచ్చుకోవడం ఒక ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ అన్నారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ చినబాబు సుంకపల్లి మాట్లాడుతూ 2026 ఫిబ్రవరి నుంచి ఉచిత క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయడానికి మేఘాలయ,


city5.2.jpg

త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. అనంతరం ఫౌండేషన్‌ స్పాన్సర్లు, సహాయకులకు రంగనాథ్‌ జ్ఞాపికలు అందజేశారు. వార్షిక జనరల్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ శైలేంద్ర కుమార్‌ జోషి తదితరులు మాట్లాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాడూ.. వీడూ.. ఎవడు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 05 , 2025 | 09:04 AM