Share News

Young Doctor Drug Case: డీజేతో పరిచయం... కొకైన్‌కు బానిస.. యువవైద్యురాలి కథ ఇదీ

ABN , Publish Date - May 10 , 2025 | 10:00 AM

Young Doctor Drug Case: హైదరాబాద్‌లో ఓ యువ వైద్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె గురించి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Young Doctor Drug Case: డీజేతో పరిచయం... కొకైన్‌కు బానిస.. యువవైద్యురాలి కథ ఇదీ
Young Doctor Drug Case:

హైదరాబాద్, మే 10: ఆమె ఓ యువ వైద్యురాలు (Doctor)... కానీ ఆమె చేసిన పనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంతో కష్టపడి చదవి డాక్టర్ అయిన ఆ వైద్యురాలు.. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. డాక్టర్‌‌గా వైద్య సేవలు అందించాల్సిన ఆమె చెడు వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. యువ వైద్యురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె గురించి చెప్పిన విషయాలు షాక్‌‌కు గురయ్యేలా చేశాయి. ఆ వైద్యురాలు దేనికి బానిగా మారింది.. పోలీసులు చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


డ్రగ్స్.. ఈ పెనుభూతాన్ని అంతమొందించేందుకు పోలీసులు చాలా శ్రమిస్తున్నారు. యువత డ్రగ్స్‌కు బానిసకావొద్దని.. తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని పదే పదే చెబుతున్నారు. డ్రగ్స్‌ నిర్మూలన కోసం అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కొంత మంది యువత డ్రగ్స్‌ బారిన పడి తమ జీవితాన్ని కోల్పోతున్న పరిస్థితి. డ్రగ్స్‌ తీసుకోవడం లేదా అమ్మడం వంటివి చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువ వైద్యురాలు కూడా మత్తు పదార్థాలకు బానిసగా మారింది. కొకైన్‌ను ఆర్డర్‌ పెట్టి తీసుకుంటున్న సమయంలో పోలీసులు పక్కా ప్లాన్‌తో వైద్యురాలితో పాటు డ్రగ్స్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

drugs.jpg

Pahalgam Terror Attack: పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..


మత్తు పదార్థాలకు బానిసగా మారిన యువ డాక్టర్.. దాదాపు ఏడాది కాలంగా 70 లక్షల విలువైన కొకైన్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని డ్రగ్ డీలర్ వంశ్ ఠక్కర్ నేరుగా లావాదేవీలు జరిపాడు. తాజాగా 53 గ్రాముల కొకైన్ ఆర్డర్ పెట్టి టీజీఎన్‌ఏబీకి అడ్డంగా దొరికిపోయింది వైద్యురాలు. షేక్ పేటలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో వైద్యురాలు నివాసముంటోంది. మహారాష్ట్రలోని థానేకు వెళ్ళినపుడు ఓ పబ్బులో డీజేతో డాక్టర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ డీజే ద్వారానే వైద్యురాలు డ్రగ్స్‌కు బానిసైంది. ఈ క్రమంలో వైద్యురాలు డ్రగ్స్‌ ఆర్డర్‌ పెట్టగా.. డ్రగ్స్‌ను డెలివరీ ఇచ్చేందుకు వంశ్ ఠక్కర్ అనుచరుడు వచ్చాడు. ఈ విషయం తెలిసిన వెంటనే టీజీఎన్‌ఏబీ సిబ్బంది అక్కడకు చేరుకుని రెడ్‌ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. వంశ్ ఠక్కర్ అనుచరుడితో పాటు వైద్యురాలి అరెస్ట్ చేసి.. దాదాపు 53 గ్రాముల కొకైన్‌ను సీజ్ చేశారు. వంశ్ ఠక్కర్‌తో సంప్రదింపులు జరిపేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందని.. ఆ వాట్సాప్ గ్రూప్‌లో ప్రముఖులు వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నట్టు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

India Missile Attacks: పాక్‌పై భారత్ దాడి.. 3 ఎయిర్‌బేస్‌లు మటాష్..

Police Alert: హైదరాబాద్‌లో పోలీస్‌ నిఘా

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 10:01 AM