Share News

VC Sajjanar: డ్రగ్స్‌పై నిఘా ఉంచుతాం: వీసీ సజ్జనార్

ABN , Publish Date - Sep 28 , 2025 | 08:56 PM

దేశంలోనే నెంబర్ వన్ కమిషనరేట్‌గా హైదరాబాద్‌ను తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని సీపీ సజ్జనార్ తెలిపారు. డ్రగ్స్ నివారణలో ముందు ముందు కఠినంగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు.

VC Sajjanar: డ్రగ్స్‌పై నిఘా ఉంచుతాం: వీసీ సజ్జనార్

హైదరాబాద్, సెప్టెంబర్ 28: శాంతి భద్రతల విషయంలో గతంలో వ్యవహరించినట్లుగానే ఇక ముందూ ఉంటానని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులైన వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ సీపీగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం.. తిరిగి తనను ఆ పదవిలో నియమించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే నెంబర్ వన్ కమిషనరేట్‌గా హైదరాబాద్‌ను తీర్చి దిద్దేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డ్రగ్స్ నివారణలో ముందు ముందు కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకునే వారు, డ్రగ్స్ విక్రయించే వారితోపాటు డ్రగ్స్ రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ప్రకటించారు. ప్రజల కోసమే పని చేస్తానని.. ప్రజల సహకారంతోనే పని చేస్తామని ఆయన పేర్కొన్నారు.


పోలీస్ శాఖను మరింత ఫ్రెండ్లీగా మారుస్తామన్నారు. దేశంలోనే నెంబర్ వన్ పోలీసింగ్ వ్యవస్థను తీర్చిదిద్దడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ నివారణపై ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అయితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఈ సమస్యను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ ఇతర శాఖల ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ సమస్య నియంత్రణ చేస్తామని తెలిపారు. ప్రయాణ సమయాన్ని తగ్గించేలా వాహనదారులకు ట్రాఫిక్ సమస్య నియంత్రిస్తామని చెప్పారు. ఏ శాఖలో ఉన్న తన పని తాను చేస్తానన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని సజ్జనార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో భక్తుల రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. స్పందించిన బండారు విజయలక్ష్మి

For More TG News And Telugu News

Updated Date - Sep 28 , 2025 | 09:35 PM