Share News

Kagaznagar Suicide: కాగజ్‌నగర్‌లో విషాదం.. భర్తను కాపాడబోయి భార్య, కూతురు..

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:49 PM

కాగజ్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోబోతున్న భర్తను కాపాడబోయి భార్య, కూతురు మృతిచెందారు.

Kagaznagar Suicide: కాగజ్‌నగర్‌లో విషాదం.. భర్తను కాపాడబోయి భార్య, కూతురు..
Kagaznagar Suicide

కొమురం భీం: కాగజ్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోబోతున్న భర్తను కాపాడబోయి భార్య, కూతురు మృతిచెందారు. కుటుంబంలో గొడవల కారణంగా భర్త రైలు కిందపడి సూసైడ్ చేసుకోవడానికి వెళ్లాడు. అతన్ని కాపాడేందుకు భార్య స్వప్న బిడ్డతో సహా రైలు పట్టాలపైకి చేరుకుంది. అదే సమయంలో.. రైలు రావడంతో తల్లి, బిడ్డను రైలు ఢీకొట్టింది. దీంతో తల్లి, బిడ్డ అక్కడికక్కడే మృతిచెందగా.. భర్తకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


పోలీసుల కథనం ప్రకారం.. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. తల్లి, బిడ్డ మృతదేహాలను రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు

GST Rate Cut: జీఎస్టీ జోష్‌

Updated Date - Sep 22 , 2025 | 12:56 PM