Tpcc Chief Mahesh Kumar: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక... పీసీసీ చీఫ్ ఫస్ట్ రియాక్షన్
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:28 PM
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఇవ్వకుండా కేంద్రం దోబూచులాడుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం కేంద్రం ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.
హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఇవ్వకుండా కేంద్రం దోబూచులాడుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం కేంద్రం ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాపై హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం సవితి తల్లిలా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.
తెలంగాణకు రావాల్సిన యూరియా కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ వద్ద ఆందోళన చేస్తున్నారన్నారు. పార్టీ ఎంపీల ఆందోళనకు ప్రియాంక గాంధీ కూడా మద్దతు పలికారని గుర్తు చేశారు. యూరియా కోసం రైతులు రహదారి పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా ఇవ్వాల్సిందిగా ఈ సందర్బంగా కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై ఇప్పటికే తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. కేంద్రం వివక్షత చూపడం.. ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు.
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి నీతికి నిజాయితీకి ప్రతీక అని పీసీసీ చీఫ్ అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నందమూరి వారి ఇంట విషాదం.. హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు
యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
Read Latest Telangana News and National News