Tollywood Producers: చర్చల పేరుతో నాటకం..నిర్మాతలపై అనిల్ కుమార్ ఆగ్రహం
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:26 PM
తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికుల గౌరవ వేతనాల కోసం చేస్తున్న పోరాటం 13వ రోజులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ న్యాయమైన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఫిలిం ఫెడరేషన్ ఆందోళనను మరింత ఉధృతం చేసింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కార్మికుల గౌరవ వేతనాల కోసం ఫెడరేషన్ నిరసన 13 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు (Tollywood Producers) చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ అన్నారు. కార్మికుల డిమాండ్లను ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. మమ్మల్ని మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పి, వారే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారని, మేము మూడు రోజులుగా మీడియాతో మాట్లాడలేదని ఆయన అన్నారు.
రాజకీయంగా అడ్డుపెట్టుకోవడం
ఈ క్రమంలో నిర్మాతలు కార్మికుల డిమాండ్లను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, రెండు షరతులను ఒప్పుకోవడం లేదని, తప్పుగా చెబుతున్నారని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల్లో ఏమీ మాట్లాడకుండా మమ్మల్ని ఒప్పుకోలేదని చెప్పడం సరికాదన్నారు. ఈ విషయాన్ని రాజకీయంగా అడ్డుపెట్టుకోవడం కూడా తప్పని ఆయన అన్నారు. 50 సంవత్సరాలుగా లేని కొత్త షరతులను నిర్మాతలు ఇప్పుడు పెడుతున్నారని, కానీ వారు ఏ గౌరవ వేతనం ఇస్తారో స్పష్టంగా చెప్పడం లేదని ఫెడరేషన్ ఆరోపించింది. వారు స్పష్టమైన నిర్ణయం చెప్పాలని, అప్పుడు మేము మా కార్యాచరణను ప్రకటిస్తామని అనిల్ కుమార్ అన్నారు.
కానీ చర్చలకు ఎవరూ కూడా..
ఫెడరేషన్ చర్చలకు సిద్ధంగా ఉందని, కానీ నిర్మాతలు అందుబాటులో లేరని ఆయన విమర్శించారు. కార్మికులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం కోసం పోరాడుతున్నారు. నిర్మాతలు కూడా కష్టాల్లో ఉన్నారని మాకు తెలుసు. అందుకే మేము కొంత రాజీకి సిద్ధంగా ఉన్నామని, కానీ చర్చలకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ వేతనం సినిమా రకం, కష్టం, ఛాంబర్, కౌన్సిల్ నిర్ణయాల ఆధారంగా ఉండాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కష్టాలను అర్థం చేసుకొని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఫెడరేషన్ కట్టుబడి ఉందన్నారు. మేము బ్లాక్ పేపర్ ఇచ్చాము, ఎలా రాయాలన్నా రాయండి అని చెప్పాము. మా కష్టానికి తగిన వేతనం ఇవ్వాలని కోరినట్లు అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి