Share News

Telangana High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా

ABN , Publish Date - Dec 11 , 2025 | 09:20 PM

తెలంగాణ హైకోర్టు ఎన్ని సార్లు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తన పద్దతి మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా విధించింది.

Telangana High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా

హైదరాబాద్, డిసెంబర్ 11: నగరంలోని జంట జలాశయాల వద్ద నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయింది. ఈ కేసు విచారణ సందర్భంగా గతంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కౌంటర్ దాఖలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంతో రాష్ట్రప్రభుత్వానికి రూ. 5 వేలు జరిమానా విధించింది. ఈ నగదును రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికారిక సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. వారంలోగా ఈ నగదు మొత్తం చెల్లించాలని ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్ రాహుల్ రెడ్డిని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ.. డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.


మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై గత నవంబర్‌లో హైకోర్టు సీరియస్ అయింది. చాలా కేసుల్లో నిర్దేశించిన గడువులోపు.. కౌంటర్ దాఖలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడింది. వికారాబాద్‌ జిల్లాలో నేవీ రాడార్‌ స్టేషన్ కేసు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ డిసెంబర్‌ 12కు వాయిదా వేసిన హైకోర్టు.. డిసెంబర్‌ 12లోపు కౌంటర్ దాఖలు చేయకుంటే.. ప్రభుత్వానికి జరిమానా విధిస్తామని ఈ కేసులో సైతం ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవడం లేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు జరిమానా విధించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

నాన్ బెయిలబుల్ వారెంట్‌పై కొండా సురేఖ రియాక్షన్

అఖండ - 2 మేకర్స్‌కి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టులో కేసు..

Read Latest TG News and National News

Updated Date - Dec 11 , 2025 | 09:22 PM