Share News

Damodara Raja Narasimha: ప్రపంచానికి మన దేశం అందించిన గొప్ప వరం యోగా: మంత్రి దామోదర రాజనర్సింహ

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:12 PM

International Yoga Day Celebrations in Hyderabad: హైదరాబాద్‌ (Hyderabad Yoga Event) గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) (International Yoga Day 2025) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీఎస్‌ రామకృష్ణారావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై యోగా విశిష్టతను గురించి ప్రజలకు వివరించారు.

Damodara Raja Narasimha: ప్రపంచానికి మన దేశం అందించిన గొప్ప వరం యోగా: మంత్రి దామోదర రాజనర్సింహ
International Yoga Day Celebrations at Gachibowli Stadium

Damodara Raja Narasimha Yoga Day: భాగ్యనగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీఎస్‌ రామకృష్ణారావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు యోగా విశిష్టత గురించి వివరించారు.


ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా. ఈ వరాన్ని మనకు అందించిన గురువు, మహర్షి పతాంజలి గారిని ఈ సందర్భంగా మనందరం స్మరించుకోవాలి. ఆయన అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారం. కానీ, ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్, క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కోట్లు సంపాదించేవారికి కూడా ప్రశాంతత ఉండడం లేదు. ఈ సమస్యలన్నింటికీ యోగా చక్కని పరిష్కార మార్గం. యోగా అనేది కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదు. శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనం. రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఏకగ్రత పెరుగుతాయి. అయితే, యోగా చేయడానికి కావాల్సిందల్లా సంకల్పం, మంచి గురువు. కాబట్టి, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యమే మహాభాగ్యమనే నానుడిని నిజం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.


ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హెల్త్ సబ్‌సెంటర్లలో రోజూ ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తున్నామని.. గతేడాది కాలంలో కొత్తగా 5 లక్షల మందికి యోగా నేర్పించామని అన్నారు. అన్ని విద్యా సంస్థల్లో యోగా నేర్పించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నేచురోపతి, యోగిక్ సైన్సెస్‌లో పీజీ కోర్సును అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలకు యోగాను చేరువచేస్తామని అన్నారు.


ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీహరి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా, మీనాక్షి చౌదరి, ఖుష్బూ వంటి సినీ ప్రముఖులు హాజరై యోగాసనాలు వేశారు.


ఇవి కూడా చదవండి

సిట్‌ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యా‌ప్‌పైనే విచారణ

యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి

భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 01:33 PM