Telangana Govt: కర్నూలు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా...
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:48 PM
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు.. గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతిచెందిన తెలంగాణ పౌరులకు ఎక్స్‌గ్రేషియాను ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
కాగా, ప్రధాని మోదీ కూడా తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి..
Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి
Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు