Share News

Engineering Colleges: ఇంజినీరింగ్ కళాశాలలు బంద్.. ఎప్పటి నుంచంటే.. ?

ABN , Publish Date - Oct 20 , 2025 | 09:06 AM

ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యం మళ్లీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ క్రమంలో విద్యార్థుల సంఘాలుతోపాటు రాజకీయ పార్టీలతో యాజమాన్యం చర్చించనుంది.

Engineering Colleges: ఇంజినీరింగ్ కళాశాలలు బంద్.. ఎప్పటి నుంచంటే.. ?

హైదరాబాద్, అక్టోబర్ 20: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో రేవంత్ సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యం ఆరోపిస్తుంది. ఆ క్రమంలో నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ పాటిస్తామని ప్రైవేట్ కళాశాలల సమాఖ్య వెల్లడించింది. అందులో భాగంగా అక్టోబర్ 22వ తేదీన ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని స్పష్టం చేసింది. సమాఖ్య కోర్ కమిటీ అత్యవసర సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా అక్టోబర్ 25వ తేదీన విద్యార్థి సంఘాలతో.. 26వ తేదీన సర్వ సభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే నవంబర్ 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో సైతం కలిసి సమావేశం జరపాలని భావిస్తున్నాయి. అయితే ఈ బంద్‌లో ఇతర వృత్తి, విద్య కళాశాలలు సైతం పాల్గొంటున్నాయి.


అసలు ఏం జరిగిందంటే..

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా ప్రభుత్వం నగదు చెల్లించక పోవడం పట్ల ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఇంజినీర్స్ డేను బ్లాక్ డేగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నిరవధిక బంద్ చేపట్టాలని తెలంగాణ కాలేజీల యాజమాన్యం ప్రకటించింది. దీంతో రేవంత్ ప్రభుత్వం దిగి వచ్చింది.


ఆ క్రమంలో యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అంటే.. ఈ చర్చలు జరిపిన అనంతరం వారం రోజుల్లో రూ. 600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని.. అలాగే మిగిలిన బకాయిలు రానున్న దీపావళికి రూ. 600 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం.. కాలేజీల యాజమాన్యానికి హామీ ఇచ్చింది. ఈ రోజు దీపావళి రానే వచ్చింది. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఏ ప్రకటన చేయకపోవడంతో.. ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యం మళ్లీ బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ విస్తారంగా భారీ వర్షాలు

‘జూబ్లీ’ జోరు.. ప్రచార హోరు..

For TG News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 09:58 AM