Share News

Kukatpally: పేకాటలో పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్, ఓ ఎమ్మెల్సీ తండ్రి...

ABN , Publish Date - Aug 17 , 2025 | 09:06 PM

కూకట్‌పల్లి వైష్ణవి కాలనీలోని ఓ గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరం ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Kukatpally: పేకాటలో పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్, ఓ ఎమ్మెల్సీ తండ్రి...

హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వైష్ణవి కాలనీలోని ఓ పేకాట స్థావరంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాలనీలోని ఓ గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరం ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు.


అయితే.. పేకాటలో పట్టుబడిన వారిలో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, జీహెచ్‌ఎంసీ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. వారిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి రూ. 2,52,090 రూపాయల నగదు, రూ. 1,10,000 రూపాయల విలువైన 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 11 మందిని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఫ్యూచర్‌ లేదు: కేటీఆర్

హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు : ఆది శ్రీనివాస్

Updated Date - Aug 17 , 2025 | 09:08 PM