Share News

Bhatti Vikramarka: సింగరేణి బోర్డు కీలక నిర్ణయం.. ఖనిజాల తవ్వకాలపై ఫోకస్..

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:41 PM

సింగరేణి బోర్డు బొగ్గు తవ్వకాలు పెంచడంతోపాటు ఇతర మినరల్స్ మైనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాయచూరు, దేవదుర్గ ప్రాంతాల్లో కాపర్ అండ్ గోల్డ్ మైనింగ్ యాక్షన్‌లో సింగరేణి పాల్గొందని చెప్పుకొచ్చారు.

Bhatti Vikramarka: సింగరేణి బోర్డు కీలక నిర్ణయం.. ఖనిజాల తవ్వకాలపై ఫోకస్..
Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్: సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఖనిజాల తవ్వకాల్లోనూ పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.


సింగరేణి బోర్డు బొగ్గు తవ్వకాలు పెంచడంతోపాటు ఇతర మినరల్స్ మైనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాయచూరు, దేవదుర్గ ప్రాంతాల్లో కాపర్ అండ్ గోల్డ్ మైనింగ్ యాక్షన్‌లో సింగరేణి పాల్గొందని గుర్తు చేశారు. దాని వల్ల సింగరేణి 37.75శాతం వాటాను దక్కించుకుందని హర్షం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లోని ఎన్టీపీసీలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మరో 25 ఏళ్లకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు.


సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకపోతే బొగ్గు బ్లాక్‌లు ప్రైవేటు వ్యక్తులకు వెళ్తాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సత్తుపల్లి, కోయగూడెం బ్లాక్‌లు ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు వెళ్లాయని గుర్తు చేశారు. అందుకే సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనాలని సూచించారు. దాంతో సింగరేణిలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. సింగరేణి గ్రీన్ ఎనర్జీ స్టోరేజ్‌‌లో భాగస్వామ్యం అవుతోందని పేర్కొన్నారు. దేశానికి క్రిటికల్ మినరల్స్ అందించడంలో భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో సింగరేణి ముందుకు వెళ్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Updated Date - Sep 12 , 2025 | 07:26 PM