Share News

Telangana Rising Global Summit: ప్రత్యేక ఆకర్షణగా రోబో... సీఎంకు హాయ్ అంటూ పలకరింపు

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:19 PM

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను అందరికీ వివరిస్తోంది.

Telangana Rising Global Summit: ప్రత్యేక ఆకర్షణగా రోబో... సీఎంకు హాయ్ అంటూ పలకరింపు
Telangana Rising Global Summit

హైదరాబాద్, డిసెంబర్ 8: భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Rising Global Summit-2025) ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను అందరికీ వివరిస్తోంది రోబో. ఇక గ్లోబల్ సమ్మిట్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కూడా రోబో హాయ్ అంటూ పలకరించింది. తిరిగి ముఖ్యమంత్రి కూడా రోబోకు హాయ్ చెబుతూ ముందుకు సాగారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఈ రోబో అందరినీ ఆకట్టుకుంటోంది.


అలాగే గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు. ముఖ్యమంత్రితో సినీ నటుడు నాగార్జున కూడా ఉన్నారు. గ్లోబల్ సమ్మిట్‌ ఆరంభ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, వివిధ రంగాలకు చెందిన దేశ, విదేశాల ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ రైజింగ్‌పై ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్‌ను వేదికపై ప్రదర్శించారు.


ఇవి కూడా చదవండి..

కూకట్‌పల్లి అభివృద్ధిపై కవిత షాకింగ్ కామెంట్స్

బైక్‌పై వెంబడించి... కత్తులు, రివాల్వర్‌తో అతి కిరాతకంగా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 08 , 2025 | 03:43 PM