Kavitha: కూకట్‌పల్లి అభివృద్ధిపై కవిత షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 08 , 2025 | 02:00 PM
కూకట్‌పల్లి అంటే ఒక మిని ఇండియా మాదిరిగా ఉందని కవిత అన్నారు. కానీ ఇక్కడ పేదవాళ్లు రెంట్‌కు ఇళ్లు తీసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 8: హైదరాబాద్‌కు కూకట్‌పల్లి కామధేనువుగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. సోమవారం కూకట్‌పల్లిలో పర్యటించిన కవిత... వై జంక్షన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మేడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో తమ పర్యటన సాగుతోందన్నారు. ఇక్కడ 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం అమ్మిందని... కానీ కూకట్‌పల్లి నియోజకవర్గం కోసం కనీసం రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని గొప్పగా పెడుతున్నారని.. కానీ కూకట్‌పల్లిలో కనీస వసతులు లేవన్నారు. ఇక్కడ ఒక్క స్టేడియం కూడా లేదని విమర్శించారు. అసలు హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ అని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉందన్నారు. కూకట్‌పల్లి అంటే ఒక మిని ఇండియా మాదిరిగా ఉందన్నారు. కానీ ఇక్కడ పేదవాళ్లు రెంట్‌కు ఇళ్లు తీసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు.
ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఓట్లు అడుగుతున్నారని.. ఓట్లు లేనప్పుడు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవటం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. పాలక పక్షం పట్టించుకోవటం లేదని.. ప్రతిపక్షం అడగటం లేదన్నారు. అందుకే జాగృతి బాధ్యతను భుజాన వేసుకొని ప్రశ్నిస్తోందని తెలిపారు. కూకట్‌పల్లిలో భూములు అమ్ముడే కాదు.. ఇక్కడ అభివృద్ధిపై కాంగ్రెస్ శ్రద్ధ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
బైక్‌పై వెంబడించి... కత్తులు, రివాల్వర్‌తో అతి కిరాతకంగా..
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై హరీష్ రావు సంచలన కామెంట్స్
Read Latest Telangana News And Telugu News