Cold Wave: గజ గజ.. సింగిల్ డిజిట్‌కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:59 AM
హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరిగి, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో 9–14 డిగ్రీలు నమోదయ్యాయి. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 8: నగరంలో చలి తీవ్రత పెరిగిపోతుంది. పట్టణమంతా చలి ప్రభావానికి వణికిపోతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణాగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోయాయి. నగరవ్యాప్తంగా తీవ్రమైన చలి గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పులతో చలి తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణంగా జనవరిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది డిసెంబర్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శేరిలింగంపల్లి 9 డిగ్రీలు, రాజేంద్రనగర్ 10.7, గచ్చిబౌలి 11, శివరాంపల్లి 12.4, తిట్టిఅన్నారం 12.4, మచ్చ బొల్లారం 13.1, అల్వాల్ 13.2, జీడిమెట్ల 13.3, కుత్బుల్లాపూర్ 13.4, కూకట్‌పల్లి 13.5, బేగంపేట 13.6, లింగంపల్లి 14.2, మాధాపూర్ 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు ధరించాలని, అత్యవసరం అయితే తప్పా ఉదయం, రాత్రి వేళల్లో బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు. చల్లగా ఉన్న ఆహారాన్ని తినకుండా.. వేడి పదార్థాలే తినాలని వెల్లడిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్