CM Revanth Reddy: అంబర్‌పేటలో సీఎం రేవంత్ పర్యటన.. ఆరు ఎస్టీపీలు ప్రారంభం..
ABN , Publish Date - Sep 28 , 2025 | 07:03 PM
ఆరు ఎస్టీపీలను 332 ఎంఎల్‍డీల సామర్థ్యంతో జలమండలి నిర్మించింది. రూ.319.43 కోట్లతో 212 ఎంఎల్‍డీ సామర్థ్యంతో అంబర్ పేట ఎస్టీపీ నిర్మించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహానగరంలో వందశాతం మురుగు నీటిని శుద్ధి చేసే లక్ష్యంతో STPలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్‌పేటలో జలమండలి నిర్మించిన 6 ఎస్టీపీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అమృత్ 2.0 పథకం కింద ఔటర్‌లో మరో 39 ఎస్టీపీ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
ఆరు ఎస్టీపీలను 332 ఎంఎల్‍డీల సామర్థ్యంతో జలమండలి నిర్మించింది. రూ.319.43 కోట్లతో 212 ఎంఎల్‍డీ సామర్థ్యంతో అంబర్‌పేట ఎస్టీపీ నిర్మించారు. నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని శుద్ధి చేసేలా ప్రభుత్వం ఎస్టీపీలను నిర్మిస్తోంది. ఈ సందర్భంగా ఎస్టీపీల పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 45 ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వం డీపీఆర్‌లు రూపొందించగా వీటిలో పూర్తయిన ఆరు ఎస్టీపీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?