Share News

మూడు రోజుల పాటు నగరంలో వర్షాలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 08:01 AM

నగరంలో వాతావరణం చల్లబడింది. సోమవారం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

మూడు రోజుల పాటు నగరంలో వర్షాలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో వాతావరణం చల్లబడింది. సోమవారం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా, సోమవారం రాజేంద్రనగర్‌, మల్కాజిగిరి(Rajendranagar, Malkajgiri), ముషీరాబాద్‌, ఉప్పల్‌, షేక్‌పేట, అల్వాల్‌, మారేడ్‌పల్లి, శేరిలింగంపల్లి బాలానగర్‌ ప్రాంతాల్లో తేలికపాటు జల్లులు కురిశాయి.


city2.2.jpg

ఇదిలాఉండగా మంగళ, గురువారం రెండు రోజుల పాటు హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి(Hyderabad, Medchal-Malkajgiri), రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు ఉత్తర దిశగా గంటకు 6-10 కిలోమీరట్ల వేగంతో వీస్తాయని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

బండి సంజయ్‌ది అసత్య ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 24 , 2025 | 08:21 AM