Hyderabad: ఆ ఏరియాల్లో.. 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jun 24 , 2025 | 07:20 AM
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 10.45 గంటల వరకు 11కేవీ ప్లే గ్రౌండ్, డీకే రోడ్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ సారథినగర్ విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ(Greenlands ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 10.45 గంటల వరకు 11కేవీ ప్లే గ్రౌండ్, డీకే రోడ్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ సారథినగర్, శాంతిబాగ్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ కార్మికనగర్, ఎర్రగడ్డ, ప్లే గ్రౌండ్, గ్రీన్‌పార్కు ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్, బాలాజీనగర్ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా మంగళవారం కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈలు వాణి, భీమాలింగప్ప సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వసంతనగర్ పరిధిలోని సర్దార్‌పటేల్‌నగర్, సాయినగర్, హైదర్‌నగర్ మెయిన్‌రోడ్డులో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, వెంకటరమణ కాలనీలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, బాలాజీనగర్ పరిధిలోని పీపుల్స్ హాస్పిటల్, వివేక్‌నగర్, బాలాజీనగర్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, వివేక్‌నగర్, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు.
హైదర్‌నగర్: మాధవినగర్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9 నుంచి 12గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ పీరునాయక్ తెలిపారు. మాధవినగర్, నవోదయకాలనీ, శుభోదయకాలనీ, వెంకటేశ్వరనగర్, మాధవరంకాలనీ, నాగార్జునస్కూల్, ఆల్విన్‌కాలనీ ఫేజ్-2, ఆదిత్యనగర్, వెంకటపతినగర్, ధరణినగర్‌లో విద్యుత్ ఉండదని ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

రామంతాపూర్: రామంతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని ఫీడర్‌లలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఆపరేషన్స్ ఏఈ కూతాడి లావణ్య తెలిపారు. చర్చి కాలనీ ఫీడర్‌లోని ప్రగతినగర్, ఇందిరానగర్, ఆనంద్‌నగర్, నెహ్రూనగర్, పోచమ్మ, మార్కండేయ ఆలయం ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, శ్రీనగర్ కాలనీ ఫీడర్‌లోని భరత్‌నగర్, శ్రీనగర్ కాలనీ, కుర్మనగర్, శాంతినగర్, హ్యాపీ బార్, పెట్రోల్ బంక్, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం, పాత రామంతాపూర్‌లలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆమె వెల్లడించారు.
వినాయక్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో..
మల్కాజిగిరి: వినాయక్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ట్యాంక్‌బండ్ ఫీడర్ మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు మినీట్యాంక్‌బండ్, బలరాంనగర్, సీతారాంనగర్, శారదానగర్, 11 కేవీ ఓల్డ్ సఫిల్‌గూడ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, ఓల్డ్ వినాయక్‌నగర్, ఓల్డ్ సఫిల్‌గూడ, దీన్‌దయాళ్‌నగర్, సుధానగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సుమన్‌క్రిస్టియాన తెలిపారు.
ఆనంద్‌బాగ్ సబ్‌స్టేషన్ పరిధిలో..
ఆనంద్‌బాగ్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఏఎన్‌ఎ్‌స ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు అనంతసరస్వతీనగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, 11 కేవీ చంద్రగిరి కాలనీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు చంద్రగిరికాలనీ, శివగౌరీ ఎన్‌క్లేవ్, నలంద స్కూల్‌లలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
11 కేవీ మహంకాళి ఫీడర్ పరిధిలో
బిట్స్ పిలానీ: 11 కేవీ మహంకాళి ఫీడర్‌లో చెట్లకొమ్మలను కత్తిరించడం, విద్యుత్‌లైన్ మెయింటనెన్స్ పనుల కారణంగా బాలాజీనగర్ ప్రధాన రోడ్డు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ప్రభుత్వ స్కూల్, డ్వాక్రాభవన్, మర్వాడిలైన్, పెద్ద మసీ దు, శివాజీనగర్, విఘ్నేశ్వరకాలనీ, మహంకాళి టెంపుల్ రోడ్డు, శ్రీరామ్ నగర్, జ్యోతికాలనీ, సీపీఐకాలనీ, లక్ష్మీనగర్, వీకేఎన్ క్లేవ్, కల్యాణ్ సులోచన ఎన్‌క్లేవ్, లివీస్ ఎన్‌క్లేవ్, భజరంగ్నగర్, రావినారాయణరెడ్డి కాలనీ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబతుతుందని ఏఈ సాంబశివరావు తెలిపారు. 11 కేవీ సాయిబాబా ఫీడర్‌లో బాలాజీనగర్ ప్రధాన రోడ్డు, వీఆర్‌ఎ ఆఫీస్, మోహన్‌రావుకాలనీ, వెంకటేశ్వరకాలనీ, సిల్వర్సీగల్లీ, మార్కెట్ రోడ్డు, సాయిబాబా టెంపుల్ కామన్ రోడ్డు, బృందావన కాలనీ, ఆనంద్ నగర్, శాంతినగర్, గీతాంజలిస్కూల్, వీరభద్రకాలనీ, చంద్రపురికాలనీ, భక్త బాయికాలనీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.
చర్లపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో
కుషాయిగూడ: చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చర్లపల్లి సబ్‌స్టేషన్ ఏఈ బాబూరావు తెలిపారు. అంబేడ్కర్ నగర్ ఫీడర్ పరిధిలోని చిన్న చర్లపల్లి, చర్చి కాలనీ, రాజీవ్ గృహకల్ప, వి.ఆర్.కాలనీ, విద్యామారుతీ నగర్, అంబేడ్కర్ నగర్, సిల్వర్ ఓక్ విల్లాస్, నేతాజీ నగర్, లక్షీ నగర్, డీసీ కాలనీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెం టు సరఫరా ఉండదని వెల్లడించారు. పెద్ద చర్లపల్లి ఫీడర్ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ, పెద్ద చర్లపల్లి, వెంకట్ రెడ్డి నగర్, పుకట్ నగర్, మధుసూదన్‌రెడ్డి నగర్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదని తెలిపారు.
మౌలాలి సబ్‌స్టేషన్ పరిధిలో
కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఆర్టీసీ కాలనీ ఫీడర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, జెడ్‌టీఎస్ తిరుమలనగర్, హనుమాన్‌నగర్, కష్ణానగర్, శివానందనగర్, పోచమ్మ టెంపుల్, పిల్లి నర్సింగరావునగర్ పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, వెంకటేశ్వరనగర్ ఫీడర్ పరిధిలోని వెంకటేశ్వరనగర్, రాఘవేంద్రనగర్, ఇందిరానగర్, హెచ్‌బీ కాలనీ, డైమండ్ హిల్స్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు మౌలాలి సబ్ స్టేషన్ ఏఈ వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి
Read Latest Telangana News and National News