Petrol Bunk Rights: పెట్రోల్ బంక్‌లో సౌకర్యాలు లేవా..? అయితే ఇలా చేయండి..
ABN , Publish Date - Oct 05 , 2025 | 03:17 PM
పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా... కొలతల్లో తేడా వచ్చినా, పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది దురుసుగా ప్రవర్తించినా... పెట్రోలు బంక్ యజమాని, సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చని పెట్రోల్ బంక్ సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
కొమరం భీం: పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు లంభించే సౌకర్యాలపై సంబంధిత అధికారులు ఓ కీలక ప్రకటన జారీ చేశారు. వినియోగదారులకు వివిధ సౌకర్యాల గురించి వివరిస్తూ.. సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాల్సిందిగా ఆ ప్రకటనలో కోరారు. పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా, వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా, టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు అందుబాటులో లేకపోయినా ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
అలాగే పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా.. పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చినా, కొనుగోలుదారులపై పెట్రోల్ బంకు సిబ్బంది దురుసుగా ప్రవర్తించినా... పెట్రోలు బంక్ యజమాని, సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
ఇండియన్ ఆయిల్-1800233355
భారత్ పెట్రోలియం-1800224344
హెచ్పీసీఎల్-18002333555
రిలయన్స్-18008919023
ఈ సందర్భంగా ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వేయాలని అధికారులు తెలిపారు. కల్తీకి దూరంగా 'మేలుకో వినియోగదారుడా' అంటూ సదరు ప్రకటనలో రాసుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు