Share News

Rajasaab Song Launch Incident: హీరోయిన్‌ నిధి అగర్వాల్‌పై అసభ్య ప్రవర్తన.. పోలీసులు సీరియస్

ABN , Publish Date - Dec 19 , 2025 | 10:33 AM

రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌పై అభిమానుల అసభ్య ప్రవర్తన‌పై పోలీసులు స్పందించారు. శ్రేయాస్ మీడియా, లులు మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Rajasaab Song Launch Incident: హీరోయిన్‌ నిధి అగర్వాల్‌పై అసభ్య ప్రవర్తన.. పోలీసులు సీరియస్
Rajasaab Song Launch Incident

హైదరాబాద్, డిసెంబర్ 19: హీరోయిన్ నిధి అగర్వాల్‌ను (Actress Nidhi Agarwal) అభిమానులు ఇబ్బందులకు గురిచేసిన ఘటనకు సంబంధించి శ్రేయాస్ మీడియా, లులు మాల్ యజమాన్యంపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసాబ్ సాంగ్ లాంచ్ సందర్భంగా ఈవెంట్ మేనేజర్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. పోలీసు బందోబస్తు లేకపోవడంతో హీరోయిన్ నిధి అగర్వాల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిధి అగర్వాల్‌పై కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం పోలీస్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన కేపీహెచ్‌బీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.


యువకుల అసభ్య ప్రవర్తనపై నిధి అగర్వాల్ ఫిర్యాదు చేస్తే మరో కేసు నమోదు చేసి పోకిరీలను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. అయితే ముందస్తు అనుమతి తీసుకోకుండా నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వహించారిని.. అందువల్లే తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడిందని కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన కారణంగా మాల్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.


కాగా.. ఈనెల 17న సాయంత్రం ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా నుంచి సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో నటి నిధి అగర్వాల్‌ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాంగ్‌ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నటి తిరిగి తన కారు వద్దకు వెళ్లే సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇదే అదునుగా భావించిన కొందరు యువకులు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న హీరోయిన్ బాడీగార్డులు అభిమానులను కంట్రోల్ చేసేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది.


నిధి అగర్వాల్ చుట్టూ బాడీగార్డులు చేరి అతి కష్టం మీద ఆమెను కారు ఎక్కించారు. అభిమానుల అత్యుత్సాహంతో తీవ్ర ఇబ్బందులకు గురైన హీరోయిన్ నిధి అగర్వాల్ కారు ఎక్కాక ఊపిరిపీల్చుకున్నారు. అయితే నిధి అగర్వాల్‌ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీతో పాటు ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండిస్తూ తప్పుబడుతున్నారు.


ఇవి కూడా చదవండి...

భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

కలకలం సృష్టించిన చాక్లెట్లు.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 19 , 2025 | 10:56 AM