Breaking: భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
ABN , Publish Date - Dec 19 , 2025 | 09:56 AM
మావోయిస్టు పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.
హైదరాబాద్, డిసెంబర్ 19: మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారీగా మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దాదాపు 40 మంది మావోయిస్టులు ఈరోజు (శుక్రవారం) తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivadhar Reddy) ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర నాయకులతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల సరెండర్‌పై ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
కాగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల అంతం తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చేపట్టారు. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు భద్రతాబలగాల కాల్పుల్లో మరణించారు. వారిలో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నారు. మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు చలపతి, బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, బస్వరాజ్ ఇలా అనేక మంది ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.
మావోయిస్టు అధినేతలు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో మావోల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ క్రమంలో గత కొంతకాలంగా మావోయిస్టులు అడవులను వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి భారీ షాక్ అనే చెప్పుకోవాలి.
ఇవి కూడా చదవండి...
కలకలం సృష్టించిన చాక్లెట్లు.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత
వీరితో పోటీ కన్నా.. ఎన్నికల్లో పోటీ తేలిక
Read Latest Telangana News And Telugu News