Share News

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుకు బిగ్ రిలీఫ్..

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:35 PM

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రణీత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుకు బిగ్ రిలీఫ్..
Phone Tapping Case

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణలో(Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు (DSP Praneeth Rao) బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి సెషన్స్ కోర్టు. లక్ష రూపాలతో పాటు రెండు పూచికత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.


ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు దాదాపు 11 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఏ2 నిందితుడు ప్రణీత్ రావు. ఈ పిటిషన్‌పై పలు మార్లు విచారణ జరిపిన న్యాయస్థానం ఎట్టకేలకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ఈనెల 11న ప్రణీత్ రావు తరపున న్యాయవాది ఉమామహేశ్వరరావు 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూర్తి చేశారు. అయితే ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాంబశివారెడ్డి గైర్హాజరు కావడంతో పీపీ వాదనల కోసం విచారణను ఈరోజుకు వాయిదా వేస్తూ జడ్జీ రమాకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సోమిరెడ్డిపై అక్రమ కేసు.. అసలు విషయమిదే..


అయితే గత విచారణలో భాగంగా ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరూ బెయిల్‌పై విడుదలయ్యారని.. ప్రణీత్ రావు ఒక్కరే జైలులో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో ఉన్న భుజంగరావు, మాజీ డీసీపీ ప్రభాకర్ రావుకు జగన్ 31న మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. అలాగే ఏఎస్పీ తిరుపతన్నకు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది. కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రణీత్ రావుకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రణీత్ రావు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలకు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతంటే..

పోచంపల్లి ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో బిగ్ ట్విస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:53 PM