Nalgonda Pocso Court: నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు.. 60 ఏళ్ల వృద్ధుడికి..
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:36 AM
2023 సంవత్సరం మార్చి నెలలో అన్నెపర్రి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు 4వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు.
నల్లగొండ: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వారిపై అఘాయిత్యాలు మాత్ర ఆగడం లేదు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొందరు కామాంధులు రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు ఒడిగడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతన్నారు. విచక్షణ మరచి దారుణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
2023 సంవత్సరం మార్చి నెలలో అన్నెపర్రి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు, 4వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నల్లగొండ పోక్సో కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా విచారణ ముగియడంతో.. కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఊషయ్యకు 24 ఏళ్ల కారాగార శిక్ష, రూ. 40 వేల జరిమానా విధిస్తూ.. కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం