Nizamabad Bank Robbery: ఎస్‌బీఐ బ్యాంకులో చోరీ.. ఐదు లక్షలు కాజేసిన 12 ఏళ్ల బాలుడు
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:58 PM
నిజామాబాద్ జిల్లా బోధన్ భారతీయ స్టేట్ బ్యాంకులో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన బ్యాంకులో రూ. 5లక్షలు చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారి నాగనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్: చిన్న పిల్లలను ఉపయోగించుకుని క్రైమ్స్ చేయించే వ్యక్తులను మనం సినిమాల్లో చూస్తుంటాం. చిన్న పిల్లలకు ఒక పని అప్పజెప్పి వెనకాల నుంచి గమనిస్తూ ఉంటారు కేటుగాళ్లు. దీనిలో అసలు విషయం ఏంటంటే.. ఆ బాలుడు క్రైమ్ చేసేటప్పుడు దొరికిపోయినా గమనిస్తున్న వాడు మాత్రం పరార్ అయిపోవచ్చు. ఒకవేళ బాలుడే పట్టుబడి మైనర్ అయితే.. జైలు శిక్షకు బదులుగా జ్యుడీషియల్ హోమ్‌కి పంపిస్తారనే విషయం నిందితులకు బాగా తెలుసు. ఇదే అదునుగా చిన్నారులతో నేరాలు చేయించే అనేక సీన్లు సినిమాల్లో దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బోధన్ లో వెలుగు చూసింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ భారతీయ స్టేట్ బ్యాంకులో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన బ్యాంకులో రూ.5లక్షలు చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారి నాగనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ఓ 12 ఏళ్ల బాలుడు క్యాష్ కౌంటర్ వైపు వెళ్లి చోరీ చేసినట్లు గుర్తించారు. బాలుడు చోరీ చేసే సమయంలో మరో ఇద్దరు అతనికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!